నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ శివాలయంలో భక్తులకు ఉపవాస దీక్షను విడిచేందుకుగాను, రామాలయ కమిటీ ఛైర్మన్ నితిన్ అన్నదాన కార్యక్రమాన్ని స్థానికుల సహాయ సహకారాలతో చేపట్టారు. శివాలయం చైర్మన్గా కొనసాగిన శంకర్ గౌడ్ అనారోగ్యంగా ఉండడంతో, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడక్ సాయిలు, అంకం గంగాధర్, శ్రీకాంత్, రఘునాథ్, రాకేష్, మీసాల నారాయణ స్థానిక యువత, తదితరులు ఉన్నారు.