శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రములో గల లక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో విద్యారణ్య భారతిస్వామి సంపూర్ణ ఆశీస్సులతో స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి అనగ ఈ నెల 16 నుండి 22 బుధవారం వరకు  ఋగ్వేద స్వాహాకార వహన కార్యక్రమాలు శ్రీ నర్సింహాల శాంత -మనోహర్ శాస్త్రి నర్సింల కవిత -సురేష్ శాస్త్రి. అరుణ -రవి శాస్త్రి ఆధ్వర్యములో. నిర్వహించారు. ఈ కార్య క్రమములో భాగంగా 20న సోమవారం వేదం పండితులచేత వేద మంత్రాల తో పూర్ణహుతి గావించారు. 22న బుధవారం స్వామివారి ఆలయాప్రాంగణములో సత్యనారాయణ వ్రతం ఆచరించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో అదికసంఖ్యలో మహిళామణులు, యువతి యువకులు,గ్రామవీడిసి, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.