రెడ్డి బజార్ వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని బాసర గ్రామంలోని రెడ్డి బజార్ వినాయక మండపంలో ఆదివారం పిఎసిఎస్ డైరెక్టర్ సప్పిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరై అక్కడికి వచ్చిన ప్రజలతో పరిచయాలు పెంచుకొన్నారు. ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో అన్నదాన కార్యక్రమాలకు రాజకీయ నాయకుల హాజరు పెరిగింది. టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు స్థానిక జెడ్పిటిసి తో కలిసి వినాయకుని ఆశీర్వాదం తీసుకొని అన్నదానానికి హాజరైన ప్రజలతో మాట్లాడారు.