వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు మండల పరిధిలోని రామాంజిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద ఉత్సవ కమిటీ, గ్రామంలోని యువత కలిసి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దీనికి ముందు మహిళలు మండపం వద్ద పూజలు చేసి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ దొర, పటేల్, పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.