
భిక్కనూరు పట్టణంలో ప్రతి గురువారం శ్రీ సాయి హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం భిక్కనూర్ పట్టణానికి చెందిన పురాం ఫ్యామిలీ ఆధ్వర్యంలో పురాం ఫ్యామిలీ సభ్యులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురాం రాజమౌళి గాంధీ చౌక్ విగ్రహం వద్ద ఉన్న హనుమాన్ దేవాలయ ఆవరణలో వృద్ధులకు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి హనుమాన్ సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.