యువసేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Food donation program under the auspices of Yuvasena Youthనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆదివారం యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాం మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.