కాంతి పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

నవతెలంగాణ –  ఆర్మూర్ 

పట్టణంలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ లో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ, అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను, వంటగదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, అలాగే వ్యాపార విలువలు మరియు లాభనష్టాల బేరీజు గురించి పిల్లలకు ఈ వయసులోనే అవగాహన వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి, విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు .