కాంతి ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం..

Food festival program in Kanti High School..నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో కాంతి హైస్కూల్లో బుధవారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటలు, స్వీట్స్ వారు స్వయంగా తయారు చేసి వాటిని ప్రదర్శించి అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఏ పని చేయాలనుకున్నా, ఏ పని చేస్తున్న వారినైనా, ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకూడదని, అలాగే ఎంతో శ్రమతో నైపుణ్యంతో పండించి తయారు చేసే ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదని, అన్ని ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసుకోవడం ద్వారా పోషక విలువలను నాణ్యతను కోల్పోకుండా ఉంటాయని, అలాగే వ్యాపారం చేసే విధానం అందులో లాభనష్టాలను గురించి తెలియజేయడమే ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం అని కాంతి హై స్కూల్ ఫౌండర్ గంగారెడ్డి అన్నారు.. ఈ సందర్భంగా నేటి సమాజంలో అధిక లాభాలు ఆశించి, తినే ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం మహా పాపమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హిమారాణి, శశాంక్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.