
శనివారం నాడు మహాశివరాత్రి ద్వాదశి సందర్భంగా మండలంలోని శివాలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రఖ్యాత గాంచిన సోమలింగాల శివాలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి మహాశివరాత్రి ఏకాదశి ఉపవాస భక్తులు ప్రత్యేకంగా పాల్గొని ద్వాదశి భోజనాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి శివాలయాల వద్ద భజన కీర్తనలు నిర్వహించారు భక్తులు ద్వాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు.