ఫుట్ ఓవర్ బిడ్జ్, రైల్వే అండర్ పాసింగ్ బిడ్జ్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలి..

– రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ డిచ్ పల్లి: రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి రైల్వే, అండర్ పాసింగ్ బిడ్జ్, ఎక్స్ ప్రెస్ రైళ్లు అజంతా, దేవగిరి, ఫాస్ట్ పాసింజర్ ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైల్వే జనరల్ మేనేజర్ కు ఘనపూర్ గ్రామభివృద్ధి కమిటీ, యూవజన సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు వాసరి సాయినాథ్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు మాట్లాడుతూ డిచ్ పల్లి రైల్వే స్టేషన్ కు ఒక వైపు అనేక గ్రామాలు, కాలేజీలు, స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పోస్ట్ ఆఫీస్ తదితర ఉన్నాయని, అలాగే ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువులు కొనాలన్న, వేరే గ్రామాలకు వెళ్లాలన్న, ఈ రైల్వే పట్టాలు దాటి వెళ్ళాక తప్పని పరిస్థితి ఉందని వారన్నారు.కానీ ఇక్కడ గూడ్స్ రైళ్లు, మాములు రైళ్లు ఆగడం వల్ల ట్రైన్ కింద నుండి దాటాల్సిన పరిస్థితి వస్తుందని, దీనివల్ల చాలా మందికి తలలు పగిలిన సందర్భాలు ఉన్నాయని, పలు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకున్నాయని విన్నవించారు. ఇక్కడ ఫుట్ ఓవర్ బిడ్జ్, అండర్ పాసింగ్ బిడ్జ్ అత్యవసరం, అలాగే ఇక్కడి ప్రజలు వెళ్లాలంటే నిజామాబాదు వెళ్లి రైలు ఎక్కి వేళల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.అదికారులు స్పందించి కావున మా డిచ్ పల్లి రైల్వే స్టేషన్లో ex ప్రెస్ రైళ్లు అజంతా, దేవగిరి, ప్యాసింజర్, స్పెషల్, రైళ్ళు ఆపితే ఇక్కడి ప్రజలకు, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ల కు, తెలంగాణ రాష్ట్ర ఎడవ పోలీస్ బెటాలియన్ సిబ్బందికి, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని వారన్నారు.ఈ కార్యక్రమం లో ఘనపూర్ గ్రామభివృద్ధి కమిటీ, గణేష్ రెడ్డి, తేజ, విజయ్, ఎంపిటిసి కుర్రి సవిత రామకృష్ణ, యువకులు సాయినాథ్, హరీష్, లింబాద్రి, శ్రీను, చిరంజీవి, సాయిలు, చంద్రకాంత్, సాగర్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.