– భారత జట్టుకు కోచ్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదీర్
హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి టర్కీ వేదికగా ఫుట్‌బాల్ స్కేటింగ్ వరల్డ్‌కప్ జరుగనుంది. ఫుట్‌బాల్ స్కేటింగ్ వరల్డ్‌కప్‌లో 33 దేశాలు పోటీపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పోటీపడే భారత జట్టుకు శాట్ కోచ్ మహ్మద్ అబ్దుల్ ఖాదీర్ జాతీయ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్ సీనియర్, జూనియర్ బుధవారం హైదరాబాద్ నుంచి బయల్దేరింది. భారత జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు తెలంగాణ అథ్లెట్లు కావటం విశేషం.