దసరా లాంటి బ్లాక్‌బస్టర్‌ కోసం..

దసరా లాంటి బ్లాక్‌బస్టర్‌ కోసం..2023లో రిలీజైన పీరియడ్‌ లవ్‌, మాస్‌ యాక్షన్‌ డ్రామా ‘దసరా’ బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటి. ఈ చిత్రానికి పని చేసిన త్రయం మరోసారి ప్రేక్షకులకు సరికొత్త చిత్రాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్న కొత్త చిత్రం కోసం దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో నాని మరోసారి జతకట్టారు. శ్రీకాంత్‌ ఓదెల ‘దసరాతో రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు. మునుపెన్నడూ లేని మాస్‌ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్‌ చేశారు. ఈ కొత్త సినిమా అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌ ఎరుపు రంగులో పెయింట్‌ చేయబడింది. ఇది వైలెన్స్‌ని సూచిస్తోంది. నాని గడ్డం, మెలితిప్పిన మీసాలతో మ్యాసీవ్‌ అవతార్‌లో కనిపించారు. నానిని పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో ప్రెజెంట్‌ చేయడానికి శ్రీకాంత్‌ మరో విన్నింగ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారని చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.