పర్యావరణాన్ని కాపాడేందుకు నేటి తరం యువత ముందుకొస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తపిస్తున్నారు. అదే బాటలో నడుస్తున్నారు ఆకాంక్ష ప్రియదర్శిని. ఐయోటి-ఎనేబుల్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ద్వారా గాలి కాలుష్యాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. భావి తరాలకు మంచి స్వచ్ఛమైన ప్రపంచాన్ని అందించేందుకు అహర్నిశలూ తపిస్తున్న ఆమె ప్రయత్నం గురించి నేటి మానవిలో…
రక్షణ రంగానికి సంబంధించిన కుటుంబంలో జన్మించిన ఆకాంక్ష బాల్యం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కొనసాగింది. లూధియానా, పూణే, సిలిగురిలో చెట్లతో కప్పబడిన రోడ్లలో బాస్కింగ్ చేయడం ఆమెకు గుర్తు. ఆకాంక్ష తన ఇల్లు, పాఠశాల చుట్టూ ఉన్న పచ్చదనాన్ని ఇష్టపడేది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఇదెంతో అవసరమని ఆమె గ్రహించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) రూర్కెలాలో బిటెక్ డిగ్రీ కోర్సులో చేరినప్పుడు దీని గురించి మరింత బాగా అర్థం చేసుకుంది. నగరాల్లో గాలి కాలుష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆమె తల్లి ఉబ్బసం వ్యాధితో ఇబ్బంది పడేది. అలాగే తన స్నేహితులు చాలా మంది శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా ఈ సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనేందుకు ఆమె తపించింది. సమస్యను పరిష్కరించేందుకు ఐయోటి-ఎనేబుల్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అయిన ఆరాసూర్‌ను ప్రారంభించడానికి ఇది దారితీసింది.
ఎలా ప్రారంభమైంది…
ఎన్‌ఐటి లో ఉన్నప్పుడు ఆకాంక్ష సీనియర్లు ఫీనిక్స్ రోబోటిక్స్ను స్థాపించారు. అక్కడ ఆమె కూడా ఇంటర్న్ చేయడం ప్రారంభించింది. ఇంజనీరింగ్ తర్వాత అందులోనే తన కెరీర్ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో రూర్కెలా స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిశ్రమ. అయితే ఈ ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని తగ్గించడంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొన్న అనేక చిన్న పరిశ్రమలు ఉన్నాయని తెలుసుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) వాటిని గాలిలోకి విడుదల చేసే ముందు ఉద్గారాలను శుద్ధి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే వారికి అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారాలు చాలా ఖరీదైన యుఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యుఎస్ ఇపిఎ) సర్టిఫైడ్ పరికరాలు. ‘మొత్తం సెటప్‌కు రూ .2.5-5 కోట్లు ఖర్చవుతుంది. ఇది చిన్న పరిశ్రమలకు సాధ్యంకాదు’ అని ఆమె చెప్పారు.
అనేక బాధ్యతలు నిర్వహించి
ఆంకాక్ష అతి తక్కువ సమయంలోనే ఫీనిక్స్ రోబోటిక్స్ ప్రధాన సభ్యురాలిగా మారారు. అక్కడ హార్డ్‌వేర్ డిజైనింగ్ నుండి దాని నిర్వహణ, కార్యకలాపాలు, సంస్థాపన, కస్టమర్లతో చర్చలు ఇలా అనేక బాధ్యతలు నిర్వహించారు. కోవిడ్-19 తర్వాత సంస్థ ఆరోగ్య సంరక్షణ, రిమోట్ కార్యకలాపాలపై తన వనరులను కేంద్రీకరించడం ప్రారంభించింది. అప్పుడు ఆకాంక్ష బతీa రసూర్ పేరుతో గాలి నాణ్యత, వరద నిర్వహణ ఉత్పత్తి కోసం బ్లూప్రింట్‌ను అభివద్ధి చేశారు. 2022లో ఆ సంస్థ నుండి బయటకు వచ్చి తన సొంత సంస్థను ప్రారంభించారు. ‘మేము డేటా అనాలిసిస్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనే ఆలోచనతో ప్రారంభించాం. విపత్తు నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల నుండి సేకరించిన డేటాను ఉపయోగించవచ్చు. మేము ప్రభుత్వంపైనే కాకుండా వాతావరణ పరిశ్రమలను కూడా కేంద్రీకరించాం. వీటిలో నిర్మాణం, రియల్ ఎస్టేట్, భీమా, పర్యావరణ సంస్థలు ఉన్నాయి’ అంటున్నారు ఆమె.
అర్థం చేసుకోడానికి
ఈ సంస్థ గూగుల్ మ్యాప్స్, ఆరాసూర్ హైపర్ లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌ను అభివద్ధి చేసింది. ఇది ఉపగ్రహ-ఆధారిత సమాచారాన్ని, 95శాతం కచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేయడానికి విశ్లేషణాత్మక పరిష్కారాన్ని ఉపయోగిస్తుంది. ‘గూగుల్‌తో మేము విస్తతమైన ఆన్-గ్రౌండ్ డేటాను సేకరించడం ప్రారంభించాం. హాట్‌స్పాట్‌లు, అధిక కలుషితమైన ప్రాంతాలు, కాలుష్యం వెనుక ఉన్న మూలాన్ని అందించడానికి, దాని నిజ ప్రాతిపదికన ప్రాసెస్ చేయడం, అంచనా వేయడం కోసం పనిచేశాం’ అని ఆకాంక్ష చెప్పారు. వాతావరణ నమూనాలను, నగరంలో లివబిలిటీ ఇండెక్స్, భీమా కోసం ఆరోగ్య ప్రభావాలు, ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడానికి వారు సేకరించిన డేటాను రిస్క్ మ్యాపింగ్ చేశారు. చివరకు వారి వాతావరణ శాస్త్రవేత్తల బృందం సహాయంతో వారు పరిష్కారాలను రూపొందించారు.
తీవ్రతను గుర్తించడానికి
ప్రారంభ హెచ్చరికలతో సహా, స్థితిస్థాపకతను పెంపొందించడానికి, ఆర్థిక నష్టాలు లేకుండా సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ‘మా పైలట్ కోసం భువనేశ్వర్‌లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి మాకు మద్దతు లభించింది. ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా మాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును చెన్నై, రాజ్కోట్, రంగాబాద్, నవీ ముంబైలకు విస్తరింపజేశాము’ అని ఆమె చెప్పారు. ఆరాసూర్ ఐఐటి డిల్లీ, ఐఐటి ముంబై, కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధనలో సహకరించింది. ఆరసూర్, టాటా రియాల్టీ మఎల్ అండ్ టి రియాల్టీ వారు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే సమస్య తీవ్రతను గుర్తించడానికి, దీర్ఘకాలికంగా అది ఆర్థికంగా ఎలా దెబ్బతింటుందో గుర్తించడానికి ఎక్కువ సంస్థలకు ఇంకా అవగాహన లేదని ఆకాంక్ష చెప్పారు.
శక్తి మహిళలకు ఉంది
ఆరాసూర్ ప్రారంభించినప్పుడు కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. రెండేండ్లకే రూ .5.4 కోట్లకు చేరింది. భారతదేశంలో 150కి పైగా నగరాల్లో మోహరించడంతో పాటు బ్రెజిల్, ఆగేయాసియాలోని కొన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది వారికి రూ.15 కోట్ల లక్ష్యం ఉందని ఆకాంక్ష చెప్పారు. వాతావరణ సాంకేతిక పరిమితిపై పనిచేసే సంస్థలు, మంత్రిత్వ శాఖలలో నాయకత్వ బాధ్యతలో పురుషులు ఆధిపత్యం చెలాయించడం సర్వసాధారణమని ఆమె పంచుకున్నారు. అయితే ఈ సమస్యను సున్నితత్వంతో పరిష్కరించుకునే శక్తి మహిళలకు ఉందని ఆమె నమ్ముతున్నారు.