ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. హౌంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్ ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇద్దరు పిల్లల మధ్య స్నేహం.. వారు పెరిగి పెద్దయిన తర్వాత కాన్సార్ ప్రాంతానికి రాజు (పథ్వీరాజ్ సుకుమారన్) కావాలనుకున్న వాడిపై శత్రువులు దాడి చేస్తే తన స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసే మరో స్నేహితుడు దేవా (ప్రభాస్) కథే సలార్ సీజ్ ఫైర్ అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అంచనాలు రిలీజ్ ట్రైలర్‌తో మరింత పీక్స్‌కి చేరుకున్నాయి. ఫస్ట్ ట్రైలర్, టీజర్, సూరీడే సాంగ్ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాయి. ఇది కేవలం యాక్షన్ సినిమాయే కాదు..అంతకు మించి ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని ఆడియెన్స్‌కి క్లియర్‌గా తెలుస్తోంది. ఈనెల 22న హౌంబలే సంస్థ ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.