
నవతెలంగాణ – జమ్మికుంట: డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 20 గ్రామపంచాయతీలలో ఉన్న లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో భీమేష్, సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్ , మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.