మరో సూపర్‌హిట్‌ కోసం..

మరో సూపర్‌హిట్‌ కోసం..షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న 8వ చిత్రాన్ని ‘చావు కబురు చల్లగా’ ఫేమ్‌ కౌశిక్‌ పెగళ్లపాటి డైరెక్టర్‌గా సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్‌ యెర్నేని క్లాప్‌ కొట్టగా, మరో నిర్మాత దిల్‌ రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. సతీష్‌ కిలారు, అన్మోల్‌ శర్మ స్క్రిప్ట్‌ హ్యాండోవర్‌ చేశారు. డిఫరెంట్‌ వరల్డ్‌, యూనిక్‌ ప్రిమైజ్‌లో సెట్‌ చేయబడిన ఈ హర్రర్‌ మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్‌లుక్‌తో సంచలనం సష్టించింది. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. గతంలో ఈ కాంబోలో రిలీజైన ‘రాక్షసుడు’చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ జంట మరో హిట్‌ కోసం సీట్‌ ఎడ్జ్‌ గ్రిప్పింగ్‌ నెరేటివ్‌ అందించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల11న ప్రారంభమై, శరవేగంగా సాగనుంది అని చిత్ర బృందం తెలిపింది. శ్రీమతి అర్చన ప్రెజెంట్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం – బి. అజనీష్‌ లోక్‌నాథ్‌, డీవోపీ – చిన్మరు సలాస్కర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ – మనీషా ఎ దత్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – డి శివ కామేష్‌, ఎడిటర్‌ – నిరంజన్‌ దేవరమానే, ఫైట్స్‌: జాషువా మాస్టర్‌, సహ రచయిత – దరహాస్‌ పాలకొల్లు.