ఔత్సాహిక ఫిల్మ్‌ మేకర్స్‌ కోసం..

అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించాలనే సంకల్పంతో శుక్రవారం హైదరాబాద్‌లో కమర్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ విజయవంతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాక్స్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రొప్రైటర్‌, కమ్మర్‌ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కమర్‌ మాట్లాడుతూ,’ఈ సంస్థ నిర్మాణంలో జరిగే సినిమాలను ఓటీటీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో సినిమాలు నిర్మించనున్నాం. ఫ్యాషన్‌ టీవీ ఇండియా, బాక్స్‌ క్రికెట్‌ లీగ్‌, ఫిల్మ్‌ ఫేయిర్‌ లాంటిసంస్థలను దిగ్విజయంగా నడుపుతున్న కమర్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించడం సంతోషంగా ఉంది. మా సంస్థలో నిర్మించబోయే సినిమాల కోసం వర్ధమాన ఫిల్మ్‌ మేకర్స్‌తో చర్చిస్తున్నాం. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఉంది’ అని తెలిపారు.