ప్రజల్లో మార్పు కోసం

Among the people
For a changeప్రజలకు ప్రజల్ని ఒకసారి తెరమీద పరిచయం చేసి, ప్రజల్లో మార్పుని ఆకాంక్షించి, దర్శకుడు వెంకటరమణ పసుపులేటి తెరకెక్కించిన చిత్రం ‘జనం’. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను చూపిస్తూ ఈ సినిమా ఈనెల 10న ప్రపంచంవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. వి.ఆర్‌.పి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దర్శకుడు వెంకటరమణ పసుపులేటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధ్య విడుదలైన ట్రైలర్‌ ప్రస్తుత సమాజాన్ని కళ్ళ ముందు నిలిపి, సినిమాపైన ఆసక్తిని పెంచే విధంగా ఉంది.
ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలను కుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు ఈ తప్పు దారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపై నడిచే కథ ఇది. దర్శకుడు ఈ కథకు పూర్తి న్యాయం చేసే నటుల్ని ఎన్నుకోవడంలో సఫలం అయ్యారు అని చిత్ర బృందం తెలిపింది.