సంపూర్ణ ఆరోగ్యం కోసం…

సంపూర్ణ ఆరోగ్యం కోసం...మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా తయారు కావాలి.
నిత్యం ఇంటి పని, వంటపనితో పాటు బయట ఆఫీసు పనితో మహిళలు బిజీబిజీ ఉంటున్నారు. కానీ ఎంత బిజీగా ఉన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదో ఒక హెర్బల్‌ టీతో రోజును ప్రారంభించాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. పుచ్చకాయ, కర్బూజ, సీతాఫలం, దానిమ్మ, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్‌, పెరుగు, మొలకెత్తిన గింజలు.. వంటి ప్రొటీన్లు ఎక్కువగా లభించే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందు డిన్నర్‌ పూర్తి చేయడం మంచిది.
జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి..
బయట దొరికే స్నాక్స్‌, జంక్‌ఫుడ్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఈ ఆహారం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి.
వ్యాయామం చేయండి..
దృఢంగా తయారు కావడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది. దీనివల్ల శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్‌, పోషకాలు బాగా సరఫరా అవుతాయి. తద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుంది. శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.