గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే.. గుండె బలోపేతానికి నిపుణులు చెబుతున్న ఉత్తమ వ్యాయామాలు ఏమిటో చూద్దాం….
రోజూ నడవాలి
నడక చాలా సులభమైన వ్యాయామం. ముఖ్యంగా స్పీడ్ వాక్ గుండె బలోపేతానికి ఒక మార్గం. ఇది హదయ స్పందన రేటును పెంచుతుంది, ఇతర వ్యాయామాల కంటే సులభంగా ఉంటుంది. ఏ సమయంలోనైనా.. ఎక్కడికైనా నడవవచ్చు. ఇందుకు కావలసిందల్లా మంచి సౌకర్యవంతమైన బూట్లు. రోజుకు కనీసం 60 నిమిషాలు నడవాలి.
బరువు శిక్షణ
బరువు శిక్షణ కండరాల బలాన్ని పెంపొందించడానికి, కొవ్వును కరిగించేందుకు ఎంతో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుకునేందుకు జిమ్‌కి వెళ్లవచ్చు. అలాగే ఇంట్లోనే వ్యాయామాలూ చేయవచ్చు. పుష్-అప్‌లు, స్క్వాట్‌లు, పుల్-అప్‌లు కండరాలను బలోపేతం చేయడానికి, ఎముక, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
స్విమ్మింగ్
స్విమ్మింగ్ అనేది కేవలం రిఫ్రెష్ వ్యాయామం మాత్రమే కాదు. స్విమ్మింగ్… పూర్తి శరీర వ్యాయామం. ఇది మన శరీరాన్ని మాత్రమే కాకుండా గుండెను కూడా బలోపేతం చేస్తుంది. ఇతర వ్యాయామాల మాదిరిగా కాకుండా స్విమ్మింగ్ మన శరీరం మొత్తాన్ని బలోపేతం చేస్తుంది.
యోగాతో
యోగా… గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. యోగా చేయడం వల్ల మీ కండరాలు బలపడతాయి. వాటిని సరైన అమరికలోకి తీసుకురావచ్చు. కొన్ని రకాల యోగా మీ హదయ స్పందన రేటును పెంచుతుంది. అదే సమయంలో మీ రక్తపోటును తగ్గిస్తుంది.
సైక్లింగ్ చేయాలి
సైక్లింగ్‌తో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మీ హదయ స్పందన రేటును పెంచడంలో సహాయపడుతుంది. సైక్లింగ్ మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
స్కిప్పింగ్ తప్పనిసరి
స్కిప్పింగ్ కూడా చాలా మంచి వ్యాయామం. ఇది మీ హదయ స్పందన నిమిషానికి 150-180 బీట్స్‌లో ఉంచుతుంది. ఇది రక్తం ఒత్తిడితో ప్రవహించేలా చేస్తుంది. శరీరాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాల బదిలీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామం ఎప్పుడైనా చేయవచ్చు. రోజుకు 15 నిమిషాలు సరిపోతుంది.