మాతృత్వం మాధుర్యాన్ని పొందాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఆ కోరిక ఒక్కటే ఉంటే చాలదు… గర్భం దాల్చిన దగ్గర నుంచి ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గర్భాన్ని స్త్రీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్త వహిస్తే సుఖ ప్రసవానికి అన్ని అవకాశాలు ఉంటాయి. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అందుకోసం గర్భవతులు ముఖ్యంగా పాటించ వలసినవి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే…
– గర్భం ధరించిన తర్వాత బరువైన వస్తువులు మోయకూడదు. ఆరోగ్యానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి.
– పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్టికాహారం, పాలు, పండ్లు వంటివి తప్పనిసరి తీసుకోవాలి.
– ఎప్పటికపుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి
– నెలలు నిండిన స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఒక వేళ తప్పనసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే కుదుపులు లేకుండా జాగ్రత్త వహిస్తూ ప్రయాణించాలి.
– వత్తిడి, భయానికి లోను కాకుండా చూసుకోవాలి.
– హైహీల్స్ వాడే అలవాటు ఉంటే నెెలలు నిండే సమయంలో వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. వీటి వల్ల అదుపుతప్పి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కడుపులోని బిడ్డకు ప్రమాదం.
– సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి.
– నిద్రపోయేటపుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం.
– అలాగే ప్రసవం అయిన తర్వాత పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు ఇవ్వడమే ఉత్తమం. తల్లి పాల వల్ల బిడ్డలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.