పీఆర్టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు

– బంజారా ఎంప్లాయీస్‌ సేవాసంఘ్ మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పీఆర్టీయూటీఎస్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డికి తెలంగాణ బంజారా ఎంప్లాయీస్‌ సేవాసంఘ్ (టీబీఈఎస్‌ఎస్‌) మద్దతు ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డిని టీబీఈఎస్‌ఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిపి రాథోడ్‌, తులసిరాం రాథోడ్‌ కలిసి మద్దతు లేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్‌ మాజీ ప్రధాన కార్యదర్శులు బీరెల్లి కమలాకర్‌రావు, గుండు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.