చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి దసరా సందర్భంగా టీజర్‌ని లాంచ్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిర్మాత విక్రమ్ మాట్లాడుతూ,”విశ్వంభర’ ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. రామ్ చరణ్ కోసం దిల్ రాజు అడగడంతో ‘విశ్వంభర’ విడుదల వాయిదా వేశాం. సినిమా షూటింగ్ కూడా అనుకున్న ప్రకారమే పూర్తయింది’ అని అన్నారు.
‘టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది త్వరలోనే చేస్తాం. చాలా బిగ్ స్కేల్ ఉన్న సినిమా ఇది. చిరంజీవితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్. ప్రేక్షకులు, అభిమానులు అంచనాలు మించేలా ‘విశ్వంభర’ ఉంటుంది’ అని దర్శకుడు వశిష్ట తెలిపారు.