పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రం కావడం విశేషం. కతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. గురువారం కతిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కతి శెట్టి అందంగా, క్యూట్‌గా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేయనున్నారు. ఇంట్రెస్టింగ్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.