న్యూఢిల్లీ : భారత వాయు సేనకు చెందిన ఒక తేజాస్ తేలిక పాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ) మంగళవారం రాజస్థాన్‌లో కూలిపోయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజాస్ ఇలా కూలిపోవడం ఇదే మొదటిసారి. 2001 జనవరి 4న తేజాస్ తొలిసారిగా గాల్లోకి ఎగిరింది. అప్పటి నుంచి ఈ 23 ఏండ్ల కాలంలో తేజాస్ ఒక్కసారి కూడా ప్రమాదానికి గురిలేదు. మంగళవారం జైసల్మేర్‌కు సమీపంలో ఒక శిక్షణ కార్యాక్రమంలో తేజాస్ కూలిపోయింది. ముందుగానే అప్రమత్తత కావడంతో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు గుర్తించేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు. 2001లోనే విజయవతంగా అన్ని పరీక్షలను పూర్తి చేసుకున్న తేజాస్ యుద్ధవిమానం 2016లో భారత సైన్యంలోకి ప్రవేశించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)తో ఈ తేజాస్‌ను ఉత్పత్తి చేస్తోంది.