ఘనంగా ఎమ్మెల్సీ క‌విత జ‌న్మ‌దిన వేడుక‌లు

– హాజరైన జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు పుర్రి స్వరూప
నవతెలంగాణ – తాడ్వాయి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్బంగా ములుగు జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప హాజరయ్యారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కల్వకుంట్ల కవిత కు దక్కుతుందన్నారు. విదేశాల్లో జాగృతి అనుబంధ‌ శాఖలు ఏర్పాటు చేసి తెలంగాణా ఉద్యమ ఆవశ్యకతను, బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసారన్నారు. మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న కవితక్కకు ములుగు జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి జాగృతి నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.