రానున్న మూడు రోజులు వర్షసూచన.. రైతులు తమ వరి ధాన్యాన్ని కాపాడుకోవాలి

నవతెలంగాణ – ఏర్గట్ల
రానున్న మూడు రోజుల పాటు వర్షసూచన ఉన్నందున రైతులు తమ వరిదాన్యాన్ని టార్పాలిన్ కాగితాలతో కప్పి ఉంచి కాపాడుకోవాలని, మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ రైతులకు తెలియజేశారు. మంగళవారం మండలకేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి, తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట సంఘ సీఈఓ జక్కని శ్రీనివాస్, సెంటర్ ఇంచార్జ్ సతీష్ గౌడ్, రైతులు ఉన్నారు.