కేరళలోని వాయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర సీమ సైతం మేం ఉన్నామంటూ అండగా నిలబడుతోంది. ఇందులో భాగంగాకి చిరంజీవి మరోమారు తన మంచి మనసుని చాటుకున్నారు. ఇప్పుడు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండిస్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే, హీరో అల్లు అర్జున్ కూడా నేను సైతం.. అంటూ తన మంచి మనసుని మరోమారు చాటుకున్నారు. అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. సినిమాలతో పాటు, ఆయన పలు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వయనాడ్ బాధితులకుయ తన వంతుగా 25 లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే కమల్‌హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సూర్య సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌సల్మాన్ రూ.35 లక్షలు, పహాద్ ఫాజిల్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల విరాళం ఇవ్వడమే కాకుండా స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ మోహన్‌లాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.