నిర్మాతల శ్రేయస్సు కోసం..

‘దర్శకరత్న దాసరి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో సభ్యుడిగా ఎదిగాను. నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చాను. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్‌ చేద్దామనుకుంటున్నాం. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తాం’ అని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్మాత సి.కళ్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నిర్మాతలకు తొలుత మెడిక్లైమ్‌ తీసుకొచ్చిందే
నేను. నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్‌ అనే గ్రూపు గండి కొట్టింది. గిల్డ్‌లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. గత నాలుగేళ్లలో ఫిల్మ్‌ ఛాంబర్‌ సర్వనాశనం అయ్యింది. నేను ఈసారి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది. డిజిటల్‌ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని దిల్‌ రాజు, దామోదరప్రసాద్‌ చెబితే గతంలో పోటీ చేయకుండా విరమించుకున్నా. చిన్న సినిమాలను ఆపితే కష్టానగర్‌ అకలితో అలమటిస్తుంది. ఈ ఎన్నికల్లో దిల్‌ రాజు కేవలం ప్రత్యర్థి మాత్రమే. గుత్తాధిపత్యం, స్టూడియోల వ్యాపారం వల్ల పరిశ్రమ బీటలు వారుతోంది’ అన్నారు.