భార్య కోసం..

భార్య కోసం..రాజ్‌ తరుణ్‌ హీరోగా, ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తిరగబడర సామీ’. మాల్వి మల్హోత్రా కథా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌ పై మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 2న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షో రీల్‌ని స్క్రీన్‌ చేశారు. హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్‌టైన్మెంట్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉన్న  సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్‌. మా నిర్మాత శివకుమార్‌ ప్రాణం పెట్టి చేశారు’ అని తెలిపారు. ‘భార్యాభర్తల అనుబంధం గురించి సినిమాలో  అద్భుతంగా చూపించాం. తన భార్యను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏవిధంగా పోరాటం చేశాడనే అంశాన్ని సినిమాలో చాలా అద్భుతంగా తెరకెక్కించాం’ అని దర్శక, నిర్మాతలు  అన్నారు.