సమాజానికి తమ వంతుగా…

సాధికారతే 'ప్రేరణ' లక్ష్యం అనాథ బాలబాలికలకు చేయూత, విద్యా అవకాశాలు, మహిళా సాధికారత సాధన కోసం కృషి చేయడం. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం 'ప్రేరణ' ఫౌండేషన్‌ 31.03.2014న స్థాపించాం. అప్పటి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన ఐదుగురు నిరుపేద విద్యార్థులకు ఇంటర్‌ మీడియట్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 30 మంది అనాథ బాల బాలికలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారికి ఉచిత విద్యతో పాటు బట్టలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నాం. 2014 నుండి 2017 వరకు గృహహింస, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని నడపించాం. ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశాం. ఈ తరగతులు ఐదు నెలల పాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో 60 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. కోర్సు పూర్తి చేసి అత్యంత ప్రతిభ కనబరిచిన 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశాము. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో 15 వారాల పాటు ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం చేపట్టాం. ఈ శిక్షణలో 60 మహిళలు పాల్గొన్నారు. హుదూత్‌ సైక్లోన్‌ వచ్చినపుడు 25 వేల రూపాయాల విరాళాలు సేకరించి బాధితులకు అందించాం. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని మూడు గ్రామాల్లో 600 మంది వదర బాధితులకు ఉచితంగా బట్టల పంపిణి చేశాం. కేరళ రాష్ట్రంలో వరదలు వచ్చినపుడు 64 వేల రూపాయలు విరళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాం. కరోనా సమయంలో హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో మూడు వేల మంది వలస కార్మికులకు ఉచితంగా కూరగాయాలు, 50 మంది పారిశుద్ధ కార్మికులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశాము. ప్రభుత్వ పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్యం, శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. శానిటరీ ప్యాడ్స్‌ పంచాం. రెండు రాష్ట్రాల్లో 10000 మందికి శీతాకాలంలో సుమారు వెయ్యి మంది పేదలకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వేల మంది అటెండర్లకు ఆహారం అందించాం. ప్రభుత్వ పాఠశాలల్లో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ కిట్లు అందిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థుల కోసం 4 అధ్యయన కేంద్రాలు నడిపిస్తున్నాం. వీటిలో 120 మంది పిల్లలకు ఉచిత ట్యూషన్లు చెబుతున్నాం. వీటితో పాటు సాహితీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి దయా హృదయంతో సహాయం చేయడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. - శరత్‌ సుదర్శి, ఫౌండర్‌, 7386046936 బి.ఆర్‌.కె చారిటీస్‌ యునెస్కో, లైన్స్‌ క్లబ్‌ సంస్థలలో కీలక పదవులు నిర్వహించిన నేను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొంతమందికైనా నా వంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో 'బి.ఆర్‌.కె చారిటీస్‌' (భళ్ళమూడి రామకష్ణ చారిటీస్‌) ప్రారంభించాను. దీని నిర్వహణ కోసం ఎవరి నుంచీ ఎటువంటి విరాళాలనూ స్వీకరించడం జరగదు. నా పరిచయస్తులు, స్నేహితులు ఈ సంస్థ ద్వారా ఎవరికైనా సాయం చేయదలుచుకుంటే నేరుగా సాయం కోరిన వారికి పరిచయం చేస్తుంటాను. సాయం కోరే వాళ్ళ దగ్గరకు సాయం చేసే వారిని తీసుకెళ్ళడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. మనం సాయం చేయదలచుకున్నప్పుడు నేరుగా వెళ్ళి అనాధ శరణాలయాల్లో కానీ, వద్ధాశ్రమాల్లో కానీ కొంత సమయాన్ని గడిపితే మనకు తెలియని మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. అది నా చుట్టూ ఉన్న వారందరూ పొందాలని నా ఆశ. ప్రతి కుటుంబంలో కనీసం నాలుగు ముఖ్యమైన రోజులు ఉంటాయి. పెళ్ళి రోజు, పుట్టినరోజు లాంటివి. ఆరోజు ఆశ్రమాలకు వెళ్ళి, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చి, వీలును బట్టి ఫీజులు కట్టగలిస్తే దాదాపు వాళ్ళ అవసరం తీరిపోతుంది. దీనిని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రతినెలా పదివేల రూపాయలు పక్కన పెట్టి నాకు తోచిన మంచి పని 'బి ఆర్‌ కె చారిటీస్‌' తరఫున చేస్తున్నాను. కొంతమంది అనాధ పిల్లలను, అంధ బాలికలను దత్తత తీసుకున్నాను. వారి కోసం కొన్ని గీతాలు రచించి, స్వరపరిచి, వారితోనే పాడించి, ఒక ఆడియో ఆల్బమ్‌ రిలీజ్‌ చేశాను. ఈ పాటలను పలు కార్యక్రమాల్లో పాడి ఆర్ధికంగా లబ్దిపొందారు. ప్రస్తుతం దానిని వీడియో ఆల్బమ్‌గా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలామంది మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ ఆకలి తీర్చుకుంటున్నారు. కానీ పాఠశాల నుంచి వచ్చిన అనంతరం హౌంవర్క్‌ చేసుకోవడానికి, రాత్రి భోజనానికి సరైన వసతులు లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కొంతమందిని ఎంపిక చేసి మా వాలంటీర్స్‌తో హౌంవర్క్‌ చేయించి రాత్రి భోజనం అందిస్తున్నాను. మొదట 20 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 150 మందికి చేరింది. అంధ విద్యార్థులకు సంగీత, నత్య, వాయిద్యాలలో శిక్షణ ఇవ్వడానికి కొంతమంది టీచర్లు వాలంటీర్స్‌గా ముందుకు వచ్చారు. అలాగే చదువుకునే స్తోమత లేక మధ్యలో ఆపేసిన వారికి కుట్టి పనిలో శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు కొని ఇవ్వడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, వద్ధాశ్రమాలలో మందుల పంపిణీ చేయడం, నిరుద్యోగులకు వారి ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటివి చేస్తున్నాను. ఏ మనిషీ ఇతరులు ముందు చేయి చాచకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించడమే 'బి ఆర్‌ కే చారిటీస్‌' ముఖ్య ఉద్దేశం. - వందన ద్విభాష్యం, ఫౌండర్‌ అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (వాలంటీర్స్‌ దినోత్సవం) ప్రతి ఏడాది డిసెంబరు 5వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ శాంతి, అభివద్ధి కోసం, కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరినీ గుర్తించుకునేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. పేదల కోసం ఎంతో కొంత చేయాలని అనుకునేవారు ఉన్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం…
ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1985, డిసెంబర్‌ 17 తేదీన చేసిన 40/212 తీర్మానంలో ప్రతి ఏడాది డిసెంబరు 5వ తేదీన స్వచ్ఛంద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా రెడ్‌క్రాస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో పాటు అనేక ఎన్‌జిఒ సంస్థలు ఈ స్వచ్ఛంద సేవకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. దాదాపు 130 దేశాల్లో 86 ఫీల్డ్‌యూనిట్లలో ఐక్యరాజ్య సమితి వాలంటీర్ల సంఘం ఏర్పాటయింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా తమ వంతు సేవలందిస్తున్నారు. అంతేకాకుండా 2000 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆన్‌లైన్‌ వాలంటీర్ల విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో సేవలందించే వాలంటీర్లు పనిచేస్తారు.
వాలంటీర్లు ముందుంటారు
ఐక్యరాజ్య సమితి 1997, నవంబరు 20వ తేదీన జరిపిన జనరల్‌ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు జపాన్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు 52/17 తీర్మానంతో 2001లో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంగా ప్రకటించబడింది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఇది తన పనిని నిర్వహిస్తుంది. ఈ ఏడాది థీమ్‌ సామూహిక శక్తి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రపంచం మరింత అభివృద్ధి సాధిస్తుంది. వాలంటీరిజం అనేది సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం. ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్నపుడు వాలంటీర్లు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటున్నారు. సంక్షోభాలు, అత్యవసర పరిస్థితుల్లో, తరచుగా వచ్చే వరదలు, భయంకరమైన పరిస్థితుల్లోనూ ముందంజలో ఉంటారు. అందుకే స్వచ్ఛంద సేవ ప్రాముఖ్యం గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి ఈ రోజును జరుపుతున్నారు.
ఎన్నో త్యాగాలు చేస్తారు
వాలంటీర్లు సామాజిక, ఆర్థిక అభివద్ధికి దోహదం చేస్తారు. వీరు సమాజానికి సేవ చేసేందుకు ఎన్నో త్యాగాలు చేస్తారు. వాలంటీర్‌ అంటే జీతం లేకుండా పని చేసే ఉద్యోగి. జీతం లేకుండా ఒక వ్యక్తి ఉద్యోగం ఎలా చేస్తాడు అనే అనుమానం సహజంగా వస్తుంది. వారి పనిలో ఏ విధమైన దురాశ ఉండదు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించరు. వీరంతా కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేసి మానసిక ఆనందాన్ని పొందుతారు. పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, బాల కార్మికులు, మహిళల వివక్ష, పర్యావరణ కాలుష్యం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడతారు. అలాగే ప్రకతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో ప్రజలకు పునరావాసం, ప్రాథమిక వైద్య సహాయం వంటి సేవలు అందిస్తారు.
వాలంటీరింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు
ఆర్థిక వ్యవస్థ అభివద్ధిలో వాలంటీర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అభివద్ధి చెందుతున్న సామాజిక సంబంధాలు ప్రభుత్వాలు, వివిధ రంగాలు, సంస్థలు, యజమానులు, ఉద్యోగుల మధ్య అంతరాలను తగ్గించడంలో వాలంటీర్లు సహాయపడతారు. సేవ చేయాలనే ఆలోచనను ఇతరుల్లో నింపుతారు. నిస్సహాయులకు జీవితంపై ఆశ కలిగిస్తారు. సేవ చేస్తున్న వారికి వివిధ రకాల ప్రజలతో కలవడం వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఇతరులకు సహాయం చేశామనే ఆనందం మనలోని డిప్రెషన్‌, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే దాని తీవ్రతను తగ్గుతుంది. శారీరక, మానసిక దఢత్వాన్ని పెంచుతుంది. మనల్ని చురుగ్గా ఉంచుతుంది. మనలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది.
– సలీమ, 94900 99083

సాధికారతే ‘ప్రేరణ’ లక్ష్యం

అనాథ బాలబాలికలకు చేయూత, విద్యా అవకాశాలు, మహిళా సాధికారత సాధన కోసం కృషి చేయడం. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం ‘ప్రేరణ’ ఫౌండేషన్‌ 31.03.2014న స్థాపించాం. అప్పటి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన ఐదుగురు నిరుపేద విద్యార్థులకు ఇంటర్‌ మీడియట్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 30 మంది అనాథ బాల బాలికలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారికి ఉచిత విద్యతో పాటు బట్టలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నాం. 2014 నుండి 2017 వరకు గృహహింస, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని నడపించాం. ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశాం. ఈ తరగతులు ఐదు నెలల పాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో 60 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. కోర్సు పూర్తి చేసి అత్యంత ప్రతిభ కనబరిచిన 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశాము. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో 15 వారాల పాటు ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం చేపట్టాం. ఈ శిక్షణలో 60 మహిళలు పాల్గొన్నారు. హుదూత్‌ సైక్లోన్‌ వచ్చినపుడు 25 వేల రూపాయాల విరాళాలు సేకరించి బాధితులకు అందించాం. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని మూడు గ్రామాల్లో 600 మంది వదర బాధితులకు ఉచితంగా బట్టల పంపిణి చేశాం. కేరళ రాష్ట్రంలో వరదలు వచ్చినపుడు 64 వేల రూపాయలు విరళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాం. కరోనా సమయంలో హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో మూడు వేల మంది వలస కార్మికులకు ఉచితంగా కూరగాయాలు, 50 మంది పారిశుద్ధ కార్మికులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశాము. ప్రభుత్వ పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్యం, శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. శానిటరీ ప్యాడ్స్‌ పంచాం. రెండు రాష్ట్రాల్లో 10000 మందికి శీతాకాలంలో సుమారు వెయ్యి మంది పేదలకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వేల మంది అటెండర్లకు ఆహారం అందించాం. ప్రభుత్వ పాఠశాలల్లో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ కిట్లు అందిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థుల కోసం 4 అధ్యయన కేంద్రాలు నడిపిస్తున్నాం. వీటిలో 120 మంది పిల్లలకు ఉచిత ట్యూషన్లు చెబుతున్నాం. వీటితో పాటు సాహితీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి దయా హృదయంతో సహాయం చేయడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
– శరత్‌ సుదర్శి, ఫౌండర్‌, 7386046936
బి.ఆర్‌.కె చారిటీస్‌
యునెస్కో, లైన్స్‌ క్లబ్‌ సంస్థలలో కీలక పదవులు నిర్వహించిన నేను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొంతమందికైనా నా వంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ‘బి.ఆర్‌.కె చారిటీస్‌’ (భళ్ళమూడి రామకష్ణ చారిటీస్‌) ప్రారంభించాను. దీని నిర్వహణ కోసం ఎవరి నుంచీ ఎటువంటి విరాళాలనూ స్వీకరించడం జరగదు. నా పరిచయస్తులు, స్నేహితులు ఈ సంస్థ ద్వారా ఎవరికైనా సాయం చేయదలుచుకుంటే నేరుగా సాయం కోరిన వారికి పరిచయం చేస్తుంటాను. సాయం కోరే వాళ్ళ దగ్గరకు సాయం చేసే వారిని తీసుకెళ్ళడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. మనం సాయం చేయదలచుకున్నప్పుడు నేరుగా వెళ్ళి అనాధ శరణాలయాల్లో కానీ, వద్ధాశ్రమాల్లో కానీ కొంత సమయాన్ని గడిపితే మనకు తెలియని మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. అది నా చుట్టూ ఉన్న వారందరూ పొందాలని నా ఆశ. ప్రతి కుటుంబంలో కనీసం నాలుగు ముఖ్యమైన రోజులు ఉంటాయి. పెళ్ళి రోజు, పుట్టినరోజు లాంటివి. ఆరోజు ఆశ్రమాలకు వెళ్ళి, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చి, వీలును బట్టి ఫీజులు కట్టగలిస్తే దాదాపు వాళ్ళ అవసరం తీరిపోతుంది. దీనిని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రతినెలా పదివేల రూపాయలు పక్కన పెట్టి నాకు తోచిన మంచి పని ‘బి ఆర్‌ కె చారిటీస్‌’ తరఫున చేస్తున్నాను. కొంతమంది అనాధ పిల్లలను, అంధ బాలికలను దత్తత తీసుకున్నాను. వారి కోసం కొన్ని గీతాలు రచించి, స్వరపరిచి, వారితోనే పాడించి, ఒక ఆడియో ఆల్బమ్‌ రిలీజ్‌ చేశాను. ఈ పాటలను పలు కార్యక్రమాల్లో పాడి ఆర్ధికంగా లబ్దిపొందారు. ప్రస్తుతం దానిని వీడియో ఆల్బమ్‌గా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలామంది మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ ఆకలి తీర్చుకుంటున్నారు. కానీ పాఠశాల నుంచి వచ్చిన అనంతరం హౌంవర్క్‌ చేసుకోవడానికి, రాత్రి భోజనానికి సరైన వసతులు లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కొంతమందిని ఎంపిక చేసి మా వాలంటీర్స్‌తో హౌంవర్క్‌ చేయించి రాత్రి భోజనం అందిస్తున్నాను. మొదట 20 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 150 మందికి చేరింది. అంధ విద్యార్థులకు సంగీత, నత్య, వాయిద్యాలలో శిక్షణ ఇవ్వడానికి కొంతమంది టీచర్లు వాలంటీర్స్‌గా ముందుకు వచ్చారు. అలాగే చదువుకునే స్తోమత లేక మధ్యలో ఆపేసిన వారికి కుట్టి పనిలో శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు కొని ఇవ్వడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, వద్ధాశ్రమాలలో మందుల పంపిణీ చేయడం, నిరుద్యోగులకు వారి ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటివి చేస్తున్నాను. ఏ మనిషీ ఇతరులు ముందు చేయి చాచకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించడమే ‘బి ఆర్‌ కే చారిటీస్‌’ ముఖ్య ఉద్దేశం.
– వందన ద్విభాష్యం, ఫౌండర్‌
మా ‘ఆకాంక్ష’

శ్రీ ఆకాంక్ష చారిటబుల్‌ ట్రస్ట్‌ 2018, జనవరి 18న ఆరుగురు సభ్యులతో ప్రారంభించబడింది. మా ట్రస్ట్‌ ముఖ్య ఉద్దేశం సేవ, సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు చేయడం. మా ట్రస్ట్‌ టాగ్‌ లైన్‌ giving is the best theropy.మొదటి కార్యక్రమం త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో ప్రారంభించాం. అప్పటి నుండి ప్రతి నెలా కనీసం మూడు, నాలుగు భిన్నమైన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలకు శ్రీ ధాత్రీ పురస్కారాలు, పర్యావరణ పరిరక్షణకై కషి చేస్తున్న వారికి, శాస్త్ర వేత్తలకు, వైద్యులకు, వికలాంగులకు, కళాకారులకు సత్కారాలు, పురస్కారాల ప్రదానం చేస్తున్నాం. కరోనా సమయంలో, కరోన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి మా సేవా కార్యక్రమాలు మరింత విస్తతం చేశాం. కరోన సమయంలో ఇంటింటింకి తిరిగి వారి అవసరాలు తెలుసుకుని విడతల వారిగా నిత్యావసర సరుకులు సుమారు 400 కుటుంబాలకు అందించాం. అవసరమైన వారికి మందులు, పేద విద్యార్థులకు స్కూల్‌ ఫీజులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, పేదింటి ఆడపిల్లల వివాహాలకు చేతనైన సాయం, చలి కాలంలో ఫూట్‌పాత్‌లపై నివసిస్తున్న వారికి రగ్గులు, దుప్పట్లు అందిస్తున్నాం. మల్కాజిగిరిలోని అంధుల ఆశ్రయంలో చేతికర్రలు, బట్టలు అందించాం. అనేక చోట్ల అన్న దాన కార్యక్రమాలు, ఆహార పొట్లాలు అందించడమే కాక రోడ్లు శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పెట్టాం. వారికి మాస్కులు, శానిటీజర్స్‌ అందించడమే కాక నూతన వస్త్రాలు అందించాం. వికలాంగులకు నిత్యావసర సరుకులు, రగ్గులు, దుప్పట్లు ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇంటర్‌ మీడియట్‌లో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన అమ్మాయిలకు నగదు పురస్కారం అందిస్తున్నాం. అలాగే దాదాపు 1500 వందల సానిటరీ నాప్కిన్స్‌ను పంచిపెట్టడంతో పనాటు అమ్మాయిలు రుతుస్రావ సమయంలో తీసుకివాల్సిన ఆహారం, పరిశుభ్రతల గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 800కి పైగా నోట్‌ బుక్స్‌ అందించాం. మా సంస్థ ద్వారా అనేకమంది కళాకారులకు అవకాశం ఇవ్వడమే కాక, సత్కారాలు కూడా చేస్తున్నాం. రాబోయే కాలంలో సేవా, సాంస్కతిక రంగాల్లో కృషి చేయాలని భావిస్తున్నాం. ఎవరైనా ముందుకు వచ్చి పెద్దమనసుతో చేయూత నిస్తే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం. మా కార్యక్రమాల్లో వారు కూడా వచ్చి పాల్గొనవచ్చు.
– పాలపర్తి సంధ్యారాణి, ఫౌండర్‌, 7981782537
మనలోని మనిషి
శ్రీనివాస్‌ గొట్టిముక్కల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనలోని మనిషి ఫౌండేషన్‌’కు జగదీష్‌, ఫణి, మోహన్‌, విజయ కిరణ్‌ ప్రధాన నిర్వహణాధికారులుగా ఉన్నారు. ఈ సంస్థ అమెరికాలో స్థాపించబడి, అనేక దేశాలకు విస్తరించింది. రైతుల, విద్యార్థుల అభివద్ధి కోసం కషి చేయడం దీని ఉద్దేశం. రైతులకు కావలసిన విత్తనాలు, వనరులు అందించి వారి అభివద్ధికి కషి చేస్తుంటారు. ఆ రైతు కుటుంబానికి ఏదైనా విపత్తు సంభవిస్తే అండగా నిలిచి, ఆ కుటుంబంలోని మరొక వ్యక్తిని రైతుగా తీర్చిదిద్దడం లేదా వారికి అనుకూలమైన రంగాలలో ప్రోత్సాహం అందించి, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే చదువులో ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులను ఎంపిక చేసి ఫీజులు కట్టి, ఉన్నత చదువులు అందిస్తారు. వారి అర్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించే వరకు ఫౌండేషన్‌ వారికి తోడుగా వుంటుంది. అమెరికాలోని మరికొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఆహార కొరత గల దేశాలకు ఆహారాన్ని అందించే, ప్యాకింగ్‌ విభాగంలో ఈ సంస్థ వాలంటీర్స్‌ పని చేస్తారు. అక్కడ చేసే గహ నిర్మాణంలో ఎక్కువ ఖర్చు భరించలేని వారికి, ఈ వాలంటీర్స్‌ వెళ్ళి ఇల్లు కట్టడంలో సహాయపడతారు. ప్రతినెలా ఆఖరి శనివారం ఇందులోని సభ్యులంతా అన్నార్తులకు ఆహార పంపిణీ చేస్తారు.