ఢీకొీట్టేటేవారికే..

For those who collide..– రెండవ విడత అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్‌ కసరత్తు
– అధికార పార్టీ అభ్యర్థికి ధీటైన వ్యక్తుల కోసం వేట
– ఉమ్మడి రంగారెడ్డిపై పట్టు సాధించేందుకు వ్యూహం
– అయోమయంలో ఆశావహులు
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. అధికార పార్టీ అభ్యర్థులను ఢీకొీట్టే వారికే టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొదటి విడతలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన ఆరు స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ స్థానాల్లో అధికార పార్టీ నుంచి బలమైన అభ్యర్థులున్నారు. దాంతో వీరిని ఎదిరించే వారికే టికెట్‌ కేటాయించేందుకు అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు మూడు నుంచి నలుగురు ఉండటంతో జల్లెడ పడుతోంది. వివిధ కోణాల్లో సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వేల ఆధారంగా అభ్యర్ధుల బలబలాలు గుర్తించి టికెట్‌ కేటాయించనుంది. అయితే తమ అభ్యర్థులు బలహీనంగా ఉంటే ఇతర పార్టీల్లో బలమైన వీరిని పార్టీలోకి తీసుకొచ్చి వారికి టికెట్‌ కేటాయించాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో రంగారెడ్డి జిల్లాపై పట్టుసాధింపునకు ఏఐసీసీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిగా ఏఐసీసీ సభ్యులను కేటాయించింది.
జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆధికార పార్టీ అభ్యర్థులను ఢకొీట్టే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం పదుల సంఖ్యలో సర్వేలు చేసింది. అభ్యర్థుల జాబితాను గుర్తించి అందులో నుంచి స్క్రినింగ్‌ చేసి బలమైన నాయకులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల మొదటి విడతలో భాగంగా జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు టికెట్లు కేటాయిం చింది. మరో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మహేశ్వరం, ఇబ్రహీం ప్నటం, రాజేందర్‌నగర్‌, శేరిలింగం పల్లి, ఎల్‌బీనగర్‌, తాండూరు నియోజక వర్గాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బలంగా ఉండటంతో వారిని ఢకొీట్టే నాయకులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది.
దీనికి తోడు టికెట్ల ఆశ చూపి ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకున్న కాంగ్రెస్‌కు టికెట్ల కేటాయింపులో తలకు మించిన భారంగా మారింది. ఒక్కో నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు మంది ఆశావహులు ఉండటంతో ఎవరికి సర్ధి చెప్పాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.
పైగా భంగపడే వారు కాంగ్రెస్‌కు ఎక్కడ కొర్రీలు పెడతారోనని తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఆశావాహులను బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రత్యేక టీమ్‌ వేసినట్టు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని చేధించి గెలుపు గుర్రాలనే బరిలో దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.