అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలి

– అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
– కొయ్యుర్ ఎఫ్ఆర్ఓ రాజేశ్వర్ రావు
నవతెలంగాణ -మల్హర్ రావు
అడవిలో అగ్ని ప్రమాదాల నివారించాలని అటవీశాఖ కొయ్యుర్ రేంజ్ అధికారి రాజేశ్వర్ రావు పశువుల కాపార్లను, రైతులను, ప్రజలను కోరారు. గురువారం మండలంలోని కొయ్యుర్  రేంజ్ పరిధిలోగల కిషన్ రావు పల్లి బిట్ గ్రామాల్లో పశువుల కాపరులకు, గ్రామస్తులకు గత రెండుమూడు నుండి ముమ్మరంగా అవగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడారు అటవీ రక్షణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫైర్ లైన్లు చేస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ బ్లోయర్లతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నష్టం పెద్దగా జరుగుతుందని తెలిపారు. వన్యప్రాణుల ఆవాసం చెదిరి విలువైన వృక్ష సంపద కనుమరువవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. చిన్నచిన్న చెట్లను మేతకు నరికితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.