ఫారెస్ట్ ఆంక్షలను తొలగించాలి..

– స్థానిక ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
– నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ డిమాండ్..
 నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పేరు మీద జన్నారం మండలంలో విధిస్తున్నా ఫారెస్ట్ ఆంక్షలను తొలగించాలని “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF) రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు, గురువారం మంచిర్యాల  కేంద్రంలోని జిల్లా అటవీ అధికారి  (డీఎఫ్ఓ  ) కార్యాలయం నుందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు, తరువాత జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించి సమస్యను వివరించారు, అనంతరం రామ్ ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు మీద అటవీ అధికారులు విధిస్తున్నా ఆంక్షల వాళ్ల అనేక అవస్థలు ఎదుర్కోవడం జరుగుతుందని, అది గత కొన్ని రోజుల నుండి తీవ్రరూపం దాల్సిందని, స్థానిక అటవీ అధికారులు చెక్ పోస్ట్ ల వద్ద స్థానికులతో దురుసుగా ప్రవర్తించడం, అడ్డగోలుగా సెస్ వసూళ్లు చేయడం స్థానికులను కూడా గుర్తింపు కార్డులు అడుగుతుండటంతో, జన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, భారత దేశంలో ఉందా! లేకపోతే వేరే దేశంలో ఉన్న అనే ఆలోచనకు రావడం జరుగుతుందని, అంతేకాకుండా జన్నారం మండలం జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మూడు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటూ అభివృద్ధి చెందడానికి ఎంత అవకాశం ఉన్న కూడా అటవీ శాఖ విధిస్తున్నా ఈ అనవసరమైన ఆంక్షల వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు, ఇన్ని రోజులు ఒప్పిక పట్టిన మండల ప్రజలు గత కొన్ని రోజుల నుండి అటవీ శాఖ అధికారులు చేస్తున్నా చర్యల కారణంగా జేఏసీ  గా ఏర్పడి గత కొన్ని రోజుల ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు, దానిలో భాగంగానే 05-02-2025 రోజున సకల జనుల బంద్ కూడా జన్నారం మండలంలో నిర్వహించడం జరిగిందన్నారు.
అటవీ అధికారుల అనాలోచిత చర్యలతో విసుగు చెందిన మండల ప్రజలు ఫారెస్ట్ అధికారులకు ఎలాంటి వస్తువులు ఇవ్వం అని కూడా తమ యొక్క వ్యాపార సంస్థలలో నోటీసులు అంటించడం జరిగిందని అన్నారు,  ఈ సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చక ముందే అధికారులు చొరవ తీసుకొని జన్నారం మండలంలో విధిస్తున్నా అటవీ ఆంక్షలు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF)” పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.  అటవీ అధికారులు   ఈ విషయంలో ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజులలో ఈ ఆంక్షల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కడం, ఉట్నూర్ మండలాలకు కూడా ఉద్యమం వ్యాపించి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.  వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నామన్నారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్   రాష్ట్ర నాయకులు నీరటి రాకేష్,జిల్లా నాయకులు ఆదిత్య,అభిరామ్,సల్మాన్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు..