వడదెబ్బకు గురై వన సేవకుడు మృతి

నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్‌
వడదెబ్బకు గురై వన సేవకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌లో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్మికల్‌కు చెందిన ఉపాధి హామీ వనసేవక్‌ గంపల దేవదాసు (58) రెండేండ్లుగా గ్రామంలోని హరిత హారం, పల్లె ప్రకృతివనం మొక్కలకు సేవకునిగా పని చేస్తున్నాడు. కొద్దిరోజు లుగా ఎండలో సైతం మొక్కలకు నీళ్లు పోస్తూ.. తరచుగా పనులు చేస్తున్నాడు. దాంతో వడదెబ్బకు గురై రెండు రోజులుగా అస్వస్థతకు గురయ్యాడు. స్థాని కంగా చికిత్స తీసుకున్న అతను.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. దేవ దాసు మృతదేహాన్ని స్థానిక సర్పంచ్‌ గంపల దావీదు, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాము సందర్శించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతునికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.