నవతెలంగాణ – జన్నారం
అడవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జన్నారం ఇన్ఛార్జి ఎఫ్ ఆర్ వో సుష్మారావు అన్నారు. గురువారం డీఎస్సీ ఫారెస్ట్రీ సెకండియర్ హైదరాబాద్ అకాడమీ విద్యార్థులు కవ్వాల్ టైగర్ జోన్ అడవిలో శిక్షణలో భాగంగా రావడంతో వారికి అవగాహన కల్పించారు. జంతు, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. డీఆర్ది తిరుపతి, అటవీ అధికారులు, శిక్షణ విద్యార్థులు ఉన్నారు.