– ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదం. ఇది Forus అనే పదం నుండి ఉద్భవించింది. అనగా గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్ధము.
– సహజ శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపం, నేలలు, నది ప్రవాహాలకు అనుగుణంగా ఏదో ఒక భౌగోళిక ప్రాంతంలో పెరిగే వృక్ష సంపదనే సహజ ఉద్భిజ సంపద అంటారు.
– 1894లో బ్రిటిష్‌వారు తొలిసారిగా అటవీ విధానాన్ని ప్రకటించారు.
– 1952 – జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి, పర్వతాలు మరియు పీఠభూములలో 60 శాతము, మైదానాలలో 20 శాతము అడవులు ఉండాలి.
– 1988లో 2వ అటవీ విధానాన్ని ప్రకటించారు. దీని ప్రకారము కొండ ప్రాంతాలలో 66%, మొత్తం విస్తీర్ణంలో 33% అడవులను కలిగి ఉండాలి.
– 1988లో భారత ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
– 2006 నూతన పర్యావరణ విధానాన్ని ప్రకటించారు.
– సామాజిక అడవులు అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. 6వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేసింది. సామాజిక అడవుల పరిశోధన కేంద్రం అలహాబాద్‌లో కలదు.
– 1950 మార్చిలో వనమహోత్సవాన్ని ప్రారంభించారు. మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించారు.
– తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం – 1,12,077 చ.కి.మీ. తెలంగాణ రాష్ట్ర వైశాల్యం రీత్యా దేశంలో 12వ స్థానం.
తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే 2017-18 ప్రకారం:
– తెలంగాణలో సామాజిక అడవులతో కూడిన అటవీ విస్తీర్ణం 27,291.99 చ.కి.మీ. ఇది రాష్ట్ర భౌగోళ విస్తీర్ణంలో అడవుల శాతం 24.04%, ఇందులో సామాజిక అడవుల విస్తీర్ణం 30%.
– ఇందులో రిజర్వుడు అటవీ విస్తీర్ణం 19,696.23. చ.కి.మీ. (72%), రక్షిత అటవీ ప్రాంతం 6953.47 చ.కి.మీ. (26%), వర్గీకరించబడని అడవులు 642.30చ.కి.మీ. (2%) ఉన్నాయి.
– 2016-17లో స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల ఆదాయం (జివిఎ)లో అడవులు, కలప పరంగా 0.4% కలిగివున్నాయి.
– 2017-18లో స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల ఆదాయంలో అడవులు, కలప రంగం 0.3 శాతం వాటా ఉంది.
– 2017-18లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ప్రస్తుత ధరలలో (ముందస్తు అంచనాల ప్రకారం) అడవులు, కలప వాటా 2,795 కోట్లు.
– 2017-18లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వృద్ధిరేటు ప్రస్తుత ధరలలో (ముందస్తు అంచనాల ప్రకారం) (అటవీ వృద్ధి రేటు): 4.9
– 2017-18లో స్థూల నికర రాష్ట్ర దేశీయోత్పత్తిలో ప్రస్తుత ధరలలో (ముందస్తు అంచనాల ప్రకారం) అడవులు, కలప వాటా 2,769 కోట్లు.
రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు
1. జయశంకర్ భూపాలపల్లి (4,505.05 చ.కి.మీ.)
2. భద్రాద్రి-కొత్తగూడెం (4,286.98 చ.కి.మీ)
రాష్ట్రంలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లాలు
1. హైదరాబాద్ (1.43 చ.కి.మీ)
2. కరీంనగర్ (3.47 చ.కి.మీ)