– సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ వ్యవస్థాప కుడు ప్రబీర్ పుర్కాయస్థ ఆరోగ్య పరి స్థితి ఎలా వుందో పరీక్షించి, నిర్ధారించేం దుకు డైరెక్టర్ల బోర్డును నియమించాల్సిం దిగా ఎయిమ్స్ డైరెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. యూఏపీఏ కింద కేసు నమోదుకాగా.. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో వున్నారు. ‘ఆస్పత్రులు వున్నవి డబ్బు సంచీల కోసం కాదు’ అని ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు అనడంతో జస్టిస్ బి.ఆర్.గవారు, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ విస్మ యానికి గురైంది. ఒక నిందితుని వైద్య చికిత్సలకయ్యే వ్యయం ప్రభుత్వం ఎందుకు భరించాలని ఎస్.వి.రాజు ఆయన ప్రశ్నించారు. ‘ఆయన మీ ప్రత్యేక అతిథి. కస్టడీలో వున్నారు. ఇలాంటి వాదనలు లేవనెత్తకూడదు. అలాంటపుడు ఆయన్ని వెంటనే విడుదల చేయండి. మంచి ఆస్పత్రుల్లో ఆయన తనకు కావాల్సిన చికిత్స చేయించుకుంటారు” అని జస్టిస్ మెహతా, సొలిసిటర్ జనరల్ రాజుతో అన్నారు. పుర్కాయస్థ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, సొలిసిటర్ జనరల్ ఏ సూత్రాన్ని ప్రస్తావిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. ‘వారు ఇబ్బందుల్లో వుంటే నేను వ్యక్తిగతంగా సాయమందిస్తా’నని సిబల్ అన్నారు. తీహార్ వైద్య బృందం అందచేసిన నివేదిక పట్ల పుర్కాయస్థ పక్షం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఆయనకు మెడికల్ పరీక్షలు చేయిం చాల్సిందిగా గత విచారణ సందర్భంగా జైలు ఆధికారులను కోర్టు ఆదేశించింది.రందించిన నివేదిక వాస్తవిక వైద్య పరిస్థితులను ప్రతిబింబించేలా లేదని, అది సరికాదని సిబల్ వ్యాఖ్యానించారు. దాంతో ఎయిమ్స్ కమిటీని వేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రెండు వారాల తర్వాత విచారణను వాయిదా వేసింది.