– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మిల్లుల వద్ద నిల్వ ఉన్న 2022-23 నాటి రబీ వరి స్టాకు కోసం తాజాగా గ్లోబల్ ఇ -టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మెన్‌గా మరో ఐదుగురు సభ్యులుగా కమిటీ టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సిఫారసులను ప్రభుత్వానికి అందజేనున్నది.