నాగిరెడ్డిపేట మండలంలోని వదలపర్తి గ్రామంలో సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయిని యాదయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలుగా సింగం విజయ, బీసీ కమిటీ అధ్యక్షునిగా లింగముల ప్రభాకర్ ,యూత్ కమిటీ అధ్యక్షునిగా చాకలి గోపాల్, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా దాలు వాళ్ళ సంజీవులు, హెడేక్ కమిటీ అధ్యక్షుడిగా బాలచందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా నియమించినట్లు రామచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట కొరపతి గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి ,మైబు రెడ్డి ప్రవీణ్ కుమార్, వంచరి చంద్రం, కొరపతి రాములు తదితరులు ఉన్నారు.