
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోన్ రావ్ ఆదేశానుసారం నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామ కమిటీ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. గోపాల్పేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొరుపోతు శేఖర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజపేట విక్రం, బీసీ సెల్ అధ్యక్షునిగా వీ రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా కలిం, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా అంతిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు షాహిద్ పాషా, నాయకులు ఇమామ్, గులాం హుస్సేన్, సుధాకర్ మంత్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.