– 20 మందితో రాష్ట్ర కమిటీ
– 7 మందితో కోర్ కమిటీ
– పాల్గొన్న 32 ఛానెల్స్, స్వంతంత్ర జర్నలిస్టులు
నవతెలంగాణ – హైదరాబాద్ : డిజిటల్ జర్నలిస్టుల హక్కులు, అభ్యున్నతి కోసం డిజిటల్ ఛానెల్స్ అండ్ జర్నలిస్టు ఫెడరేషన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ణాన కేంద్రంలో డిజిటల్ ఛానెల్స్, జర్నలిస్టుల మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు కంబాలపల్లి క్రిష్ణ మాట్లాడుతూ ‘దేశంలో ప్రజల గొంతుకగా డిజిటల్ మీడియా పని చేస్తోంది. వేగంగా అభివ్రుద్ధి చెందిన సోషల్ మీడియా ఎంతో క్రెడిబిలిటీ సాధించింది. కొద్ది మంది అతి కారణంగా అబాసుపాలు కూడా అవుతోందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. డిజిటల్ జర్నలిస్టుల హక్కుల కోసం ఏర్పడుతున్న ఈ సంఘానికి తన పూర్తి మద్ధతు ఉంటుందని, అభినందనలు తెలిపారు.
ఐక్యంగా పనిచేద్దాం : వనజ
డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ఛానెల్స్, జర్నలిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్టు సి వనజ అన్నారు. రానున్న రోజుల్లో బ్రాడ్ కాస్ట్ చట్టం యూట్యూబ్ ఛానెళ్ల గొంతు నులిమేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. సంఘంగా ఉండటం తక్షణ అవసరం అని ప్రకటించారు. జట్టుగా లేకుంటే రానున్న ప్రమాదాల్ని ఒంటరిగా ఎదుర్కొవడం ఎవరివళ్ల సాధ్యం కాదని చెప్పారు.
ప్రగతిశీల శక్తులు ఏకం కావాలి : అబ్బాస్
డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ప్రగతిశీల శక్తులు ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రముక యాక్టివిస్ట్, అబ్బాస్ అన్నారు. ఒకరికొకరు ఎంత మాత్రం పోటీ కాదు. కంటెంట్, టెక్నాలజీలను పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఛానెల్స్ ను వ్యక్తులను కలుపుకొని ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ కమిటీ పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు
కట్టడి చేయడం కాదు.. గుర్తించండి : సుందర్
డిజిటల్ మీడియా అనగానే కట్టడి చేయాలి అనే దోరణిలో ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు సీనియర్ జర్నలిస్టు, టీ10 సీఈవో సుందర్. ఆయన మాట్లాడుతూ.. ముందు డిజిటల్ జర్నలిస్టులను గుర్తించి, వారికి కనీస హక్కులైన అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలి. రోజురోజుకు డిజిటల్ జర్నలిస్టులపై దాడులు, అక్రమకేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి మూలన డిగ్రీలు పీజీలు చేసిన యువత స్వయం ఉపాధితో పాటు, ప్రశ్నించేందుకు డిజిటల్ మీడియాను సాధనంగా వాడుతున్నారని మాట్లాడారు.
20 మందితో రాష్ట్ర కమిటీ, 7 మందితో కోర్ కమిటీ
32 ఛానెల్స్ మరియు స్వతంత్ర జర్నలిస్టులతో కలిసి 57 మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఈ69 భాను ప్రసాద్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం 20 మందితో రాష్ట్రకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడు మందితో కోర్ కమిటీని ఎన్నుకున్నారు. టీ10 సుందర్, ఈ69 భాను ప్రసాద్, మహువా మీడియా వనజ, ఎన్9 మీడియా రాకేష్, మాస్ వాయిస్ శంకర్, జనం టీవీ శంకర్, ఇజం టీవీ లాట్కాడ్ నారన్న లతో కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు రాచకొండ రమేష్, నేషనల్ వెబ్ ఛానెల్స్ అసోసియేషన్ బాలక్రిష్ణ, ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్టు పెడరేషన్ తిరుపతి రెడ్డి, నాగేష్ భూంపల్లి, యాటల సోమన్న, ఏవీఎం వెంకటేష్, మిట్టి మీడియా రవి, తెలంగాణ శ్యాం, టీ21 లెనిన్, ఎ6 ఆదేశ్, మనరైతు శోభన్, వర్తమానం టీవీ ఉదయ్, ఉమెన్ కలెక్టీవ్ విప్లవ శ్రీ, వీరయ్య, డానియల్ మొదలగువారు పాల్గొన్నారు.