టీడీపీ బస్సుయాత్రపై సమాలోచనలు తొమ్మిది కమిటీల ఏర్పాటు

– పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేకంగా క్యాలెండర్‌
– రంగం సిద్ధం చేస్తున్న కాసాని
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ నిర్వహించనున్న బస్సుయాత్రకు సన్నాహాలు ప్రా రంభమయ్యాయి. ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుయాత్ర, ఇతర అంశాలపై చర్చించారు. ఇందులో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, బక్కని నర్సింహులుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆగస్టు మూడవ వారంలో బస్సుయాత్ర నిర్వహించాలనీ, బస్సుయాత్ర నిర్వహణ కోసం తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేశారు. యాత్రను విజయవంతంగా నిర్వహించే విధంగా చూసేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేయాలని నిర్ణ యించారు. రాబోయే మూడు నెలల్లో పార్టీ చేసే కార్యక్ర మాల క్యాలెండరును సైతం సిద్ధం చేయాలని నిర్ణయిం చారు. ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు హైదరాబా ద్లోని ఎన్టీఆర్‌ భవన్‌లో వర్క్‌షాప్‌ చేపట్టనున్నారు. మొదటి రోజు భువనగిరి, చేవెళ్ల, హైదరాబాద్‌, జహీరా బాద్‌, మహబూబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, సికింద్రాబాద్‌, నల్లగొండ నియోజకవర్గాల నేతలతో మాట్లాడనున్నారు. రెండవ రోజు కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, నాగ ర్కర్నూల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, వరంగల్‌ నాయకులతో వర్క్‌ షాపు జరగనుంది. ఈ వర్క్‌షాపులో బస్సుయాత్ర రూట్‌ మ్యాపు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నారు. ప్రజా సమస్యలు చర్చ జరుగుతుంది. వీటి పై నాయకుల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని కార్యాచరణను రూపొందించనున్నారు. టీడీపీ చేసిన అభివద్ధి, సంక్షేమాన్ని బస్సు యాత్రలో ప్రజలకు వివరి స్తామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అంటు న్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఏమి చేయబోతు న్నదో కూడా ఈ యాత్రలో వివరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ ప్రజల ఆశీర్వాదం కొరనున్నారు.