స్పెషల్‌ లీగల్‌ యాంటీ క్వాకరీ కమిటీల ఏర్పాటు : టీఎస్‌ఎంసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్‌ లీగల్‌ యాంటీ క్వాకరీ కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) తెలిపింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా డాక్టర్లతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు.
19 మందిపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు
రాష్ట్రంలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 19 మందిపై సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టు టీఎస్‌ఎంసీ తెలిపింది. వీరే కాకుండా ఆయుష్‌ వైద్య విధానల అర్హత కలిగి అల్లోపతిక్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న 17 మంది డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆయుష్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అర్హత లేకుండా చేస్తున్న వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలున్న కొంత మంది డాక్టర్లు, ఆస్పత్రులకు నోటీసులను జారీ చేశారు.