ఉద్యోగ సమస్యలపై సబ్ కమిటీ ఏర్పాటు

Formation of sub-committee on employment issuesనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని టీఎన్జీవో యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన వారు పట్టణంలోని టీఎన్జీఓఎస్ లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముందుగా వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సబ్ కమిటీలో ముఖ్యంగా జేఏసీ డిమాండ్లపై చర్చించడం జరుగుతుందన్నారు. జీఓఎంఎస్ నంబరు 1481 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి జేఏసీ డిమాండ్లకు చర్చించడానికి కమిటీ వేయడం చాలా హర్షనీయమన్నారు. సబ్ కమిటీ అతి త్వరలో  ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం మరి చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. వికారాబాద్ లో అధికారులపై దాడి జరగడం అమణుశమన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్స్ అందరూ లంచ్ అవర్ డెమోస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నైతిక ప్రభుత్వం స్థైర్యం దెబ్బతినకుండా  గట్టి చర్యలు తీసుకోవాలని దుండగులను కటినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసి చైర్మన్ సంద అశోక్ కుమార్, కార్యదర్శి నవీన్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు  దారం శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్, అమరేందర్, తిరుమలరెడ్డి, అరుణ్ కుమార్, రాజేశ్వర్, గోపి, కొండూరు గంగాధర్, శివకుమార్, శ్యామ్ నాయక్, సప్తర్ అలీ పాల్గొన్నారు.