తెలంగాణా బడ్జెట్ స్కూల్ మెనేజ్మెంట్ అసోసియేషన్ ఆవిర్భావం ..

నవతెలంగాణ – భువనగిరి
హైదరాబాదులోని తుర్కయంజాల్ శుభం కన్వెన్షన్ హాల్లో రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు 25 జిల్లాల పాఠశాలల ప్రతినిధులు హాజరై, మరో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన భువనగిరిలో విడుదల చేశారు. ఈనెల 24 శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బడ్జెట్ పాఠశాలల మరో సంఘం ఆవిర్భావం కానున్నది అన్నారు. ఈ సంఘం ఆవిర్భావానికి ముఖ్యఅతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, ఏఐసిసి కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు,టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు హాజరవుతారని తెలిపారు. ఈ సంఘం ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి,తల్లిదండ్రులకు, అందుబాటులో ఫీజులను ఉంచడానికి ,బడ్జెట్ పాఠశాల సంఘం హామీ ఇస్తుందని తెలిపారు. అలాగే బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులను కంకణ బద్ధులను చేసి, తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ సంఘం ఆవిర్భావానికి రేపు ప్రతి జిల్లాలోని పాఠశాల వ్యవస్థాపకులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రస్మ సంఘానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.