– బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో..
నవతెలంగాణ-సిటీబ్యూరో
పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్ దుర్గారవును వెస్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసు వ్యవహారంలో దుర్గారావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. షకీల్ కొడుకు పారిపోయేందుకు సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో దుర్గారావును సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఇక అరెస్టు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లులో దుర్గారావును పట్టుకున్నారు.
డిసెంబర్ 24న అర్ధరాత్రి ప్రజా భవన్ వద్ద తన కారుతో బారికేడ్‌ను ఢకొీట్టిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమా రుడు సాహిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసు లు పలువురిని అరెస్టు చేశారు. అయితే సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించాడని దుర్గారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దుర్గా రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్టు చేస్తే తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్‌లో పేరొన్నారు. అయితే, ఈ కేసులో సీఐను ఏ11గా చేర్చారు. ఎట్టకేలకు తాజాగా సీఐను పోలీసులు అరెస్టు చేశారు.