మాజీ సీఎం కేసీఆర్‌కు పలువురి పరామర్శ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను బుధవారం పలువురు పరామర్శించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి, సినీ నటుడు అక్కినేని నాగార్జున, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, శాంతా బయోటిక్స్‌ అధినేత వరప్రసాద్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.