
నవతెలంగాణ – జమ్మికుంట
వీణవంక పర్యటనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా అబద్ధపు, అసత్యపు ప్రచారాలు మాత్రమే మాట్లాడినాడని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . హుజురాబాద్ నియోజకవర్గం లో ఎక్కడ పంట భూములు ఎండిపోలేదని, పూర్తిగా వడ్ల కొనుగోలు చేశామని అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ను చూసి ఓర్వలేని కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్ పై తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఇంటికి పోవడం హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు . గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వేల కోట్ల అక్రమ ఆస్తులు కెసిఆర్ కుటుంబ సభ్యులు అయిన వినోద్ కుమార్ సంపాదించాడని ఆయన ఆరోపించారు. వినోద్ కుమార్ కరీంనగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ మీద ఏం మాట్లాడలేదని, దీన్నిబట్టి అర్థం అవుతుందని, రెండు పార్టీలు ఒకటేనని స్పష్టం అవుతుందన్నారు.కెసిఆర్ తన కూతురి అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపికి లొంగి పోయాడన్నారు. వంద రోజులలో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.