నవతెలంగాణ – తొగుట
తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్దపడ్డ కేసీఆర్ కారణ జన్ముడిగా చరిత్రలో నిలిచిపోయారని మం డల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం విలేకులతో మాట్లాడుతూ నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని కోరారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ కోసం కెసిఆర్ నాయ కత్వంలో అలుపెరుగని పోరాటం సాగించారణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పోరాటం చేసి నా తెలంగాణ రాష్ట్రం సిద్ధించక పోవడంతో 2009 నవంబర్ 29న సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో “తెలంగాణ వొచ్చుడో కెసిఆర్ సచ్చుడో” అని ఆమరణ దీక్షకు పూనుకోవడంతో ఉద్యమం ఉదృతంగా కొనసాగిందన్నారు. కెసిఆర్ ను కరీంనగర్ లోనే అరెస్టు చేయడం, ఖమ్మం జైలుకు తరలించడంతో ఉద్యమం ఉవ్వెత్తున లేవడం, తెలంగాణ స్వరాష్ట్ర సాకారం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ను దీక్షా దివస్ పేరున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 29న ఉదయం 9గంటల నుండి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనీ అన్నారు. కార్యక్రమానికి మండలం లోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు సూతారి రమేష్, భాస్కర్ గౌడ్, శ్రీని వాస్ గౌడ్, నర్సింలు, అరుణ్ కుమార్, ఆంజనేయు లు తదితరులు ఉన్నారు.